Thursday, 24 October 2013

మురమళ్ళ వీరేశ్వరస్వామి - భద్రకాళీ దేవి

మురమళ్ళ వీరేశ్వరస్వామి - భద్రకాళీ దేవి

దక్షుడు లోక సంరక్షణార్ధం చేస్తున్న ఒక యాగానికి అల్లుడైన పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు.

ఈశ్వరుడి భార్య దక్షుడి కుమార్తె అయిన దాక్షాయని తన భర్త అనుమతి పొందకుండా ఆ యాగానికి వెళ్లింది. దక్షుడు అవమానించగా హోమాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది.

ఆ తర్వాత కూడా ఆవేశం తగ్గక కోటి సూర్య ప్రకాశంతో తిరిగాడు వీరభద్రుడు. ఆ ఆవేశానికి భూమి అదిరింది. అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అగ్నికి ఆహుతయ్యాయి.

వీరభద్రస్వామి ఆవేశాన్ని తగ్గించే బాధ్యతను తన మరో రూపమైన భద్రకాళికి అప్పగించింది పార్వతి.

గౌతమి నది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని కొందరు మునులు నివసించేవారు. అందుకే ఆ ప్రదేశాన్ని మునిమండలి అని కూడా పిలిచేవారు.

అక్కడే ఆవేశంలో వున్న వీరభద్రుడు మదం పట్టిన ఏనుగులా తిరుగుతుండేవాడు. భద్రకాళి ఆ ప్రదేశానికి వచ్చింది ప్రక్కనే వున్న శరభయ్య చెరువులో మునిగి అతిలోక సౌందర్యతిలా కన్యారూపం దాల్చి వీరభద్రుడికి దగ్గరైంది.

ఆమెను చూసిన క్షణమే వీరభద్రస్వామి ఆవేశం కొద్దిగా తగ్గింది. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరభద్రస్వామి ఆవేశమూ తగ్గింది.

ఆనాటి నుండి వీరభద్రస్వామి దేవిని ప్రతిదినమూ కలుసుకునేవాడు. ఈ నిత్య కల్యాణానికి అగస్త్యముని, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతమ మహర్షి మొదలైన వారు వచ్చే వారని అంటారు.

వీరభద్రస్వామి దేవిని వివాహం చేసుకున్న ఆచోట ఒక ఆలయం వెలిసింది. ఆ తర్వాత గౌతమి నది ఉప్పెనవల్ల మునిగిపోయింది. లింగరూపంలో వున్న వీరభద్రస్వామి, భద్రకాళిదేవి విగ్రహం వెల్లువలో కొట్టుకునిపోయి గోదావరి నదిలో మునిగిపోయి అట్టడుగుభాగాన వుండిపోయాయి.

అప్పుడు కుమరగిరిని పాలించేవాడు శరభరాజు. ఆ రాజుకు స్వప్నంలో వీరభద్రస్వామి గోదావరి నదిలో తానున్నట్టూ తనను వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు.

ఆ రాజు తన పరివారంతో గోదావరి నదికి వెళ్లి నదిలో మునిగిపోయివున్న వీరభద్రస్వామిని వెలికితీసే ప్రయత్నంలో లింగంపై గునపం తగిలింది. రక్తం స్రవించగా గోదావరి నది ఎరట్రరి రంగులా మారిపోయింది.

ఆ సమయంలో ఆకాశవాణి "తాను గోదావరి అడుగున వున్నానని బయటికి తీసుకెళ్ళమని" పలికింది. రాజు అతని పరివారము లింగాన్ని వెలికితీశారు. కొంతదూరం తీసుకెళ్ళారు. అంతలో లింగం ఎవరూ మోయలేనంత బరువు పెరిగిపోయింది.

ఆ స్వామికి అదే చోటే సరైనదని నిర్ణయించుకున్న ఆ రాజు అక్కడే ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు.

కొంత కాలం గడిచింది.

రౌతు పేరమ్మ అనే ధనవంతురాలి ఓడ సముద్రంలో ఉప్పెన వాతన పడగా ఆమె తన ఓడ సురక్షితంగా ఒడ్డు చేరితే వీరేశ్వరస్వామికి మండపం నిర్మిస్తానని మొక్కుకుంది.

ఓడ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మొక్కుబడి ప్రకారం ఆ స్వామికి ఆలయంలో ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు.

తూర్పు గోదావరి జిల్లాలో మురుమళ్ళ గ్రామంలో వుంది భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం. మునులు ఆశ్రమంలో నివసించినందువల్ల ఆ ప్రదేశాన్ని మునిమండలి అని పిలువబడిన ఈ ప్రదేశం కాలక్రమేణా మురమళ్ళగా మారింది.

గోపురద్వారం దాటి ముందుకెళ్తే పెద్ద ప్రాకారం బలిపీఠం, ధ్వజస్తంభం తర్వాత వున్న మండపంలో స్వామివారి ఎదుట రెండు నందులు. ఇందులోని చిన్న నందిని ఉపనంది అంటారు.

గర్భగుడి ఎదుట కుడివైపున వినాయకుడి దర్శనం లభిస్తుంది.

గర్భగుడిలో వీరేశ్వరస్వామి అనబడే వీరభద్రస్వామి లింగరూపం పశ్చిమ దిక్కున చూస్తున్నట్టున్న విగ్రహం చూడ్వచ్చు. గునపం తగలడం వల్ల దెబ్బతిన్నస్వామి వారి లింగాన్ని దర్శించగలం.

ఉగ్రమైన వీరభద్రస్వామికి రోజూ అభిషేకానికి ముందు చందనాలంకారం చేస్తారు. అయినా ఆస్వామికి అర్పించే బిల్వ దళాలు ఒక గంటలో వాడిపోతాయట.

గోదావరి నది నుండి నీటిని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. ఆ తర్వాత స్వామివారికి చేసే అభిషేకం మరుసటిరోజు దాకా ఉంటుంది.

స్వామివారి రౌద్రాన్ని తగ్గించడానికి అమ్మవారు కన్యారూపధారణ అదే పీఠం పై ప్రతి్ష్టిపబడింది.

లింగరూపంలో వీరేశ్వరస్వామి, కన్యారూపంలో భద్రకాళిదేవిని ఒకే పీఠంపై చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

గర్భగుడికి ముందున్న అర్ధమండపంలో వృషభ వాహనం పై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించగలం.

స్వామిని దర్శించిన తర్వాత తూర్పు ద్వారంలో బయటకి వెళ్తే చిత్రగుప్తుని దర్శించగలం.

నిత్య కల్యాణ ఆలయమైనఅందువలన పెరవేసుకున్న నిత్య కల్యాణ ఆలయమైనందువల్ల పెనవేసుకున్న జంట నాగుల శిల్పాలు స్తంభాలపై చెక్కినారు.

ఆలయ ప్రాకారంలో ఒక ప్రత్యేకమైన మందిరంలో క్షేత్రపాలకుడు నరసిణస్వామి లక్ష్మిదేవి సమేతంగా వున్న విగ్రహం కన్నులవిందు చేయగలదు.

ఈ ఆలయంలో వీరభద్రస్వామి వారికి నిత్య కల్యాణం జరుగుతుంది.

పెళ్లికాని కన్యలకు, స్వామితో పెళ్లి జరిపిస్తే అన్ని సమస్యలు పోయి త్వరలో పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో ఇక్కడ ప్రతి రోజు కనీసం 27 వివాహ మహో్త్సవాలు జరుగుతాయి.

ఉప్పెన వచ్చినా, మరే ప్రకృతి బీభత్సం జరిగినా, ఈ పెళ్లి ఉత్సవాలు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రారంభించి రాత్రి 10.30 దాకా జరుగుతాయి.

ఈ ఉత్సవం జరిగేటప్పుడు యక్షగాన కళాకారులు పాటలు పాడుతారు. మేళ తాళాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ఆరోజు స్వామివారికి పంచభక్ష పరమాన్నాలతో 12 కుండలలో అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత రాత్రంతా వివాహ ఉత్సవాలు జరుగుతాయి.

పెళ్లి జరిగిన తర్వాత దంపతీ సమేతంగా ఆలయానికి వచ్చేవారు అక్కడ ఇచ్చే బియ్యం తీసుకెళ్లి వండి తింటే సంతాన భాగ్యం లభిస్తుంది.

సుఖప్రసవం జరగాలని మొక్కుకునే భక్తుల కోసం నంది పక్కనే ఉన్న ఉపనందిని తిప్పి పెడతారట. తప్పక సుఖప్రసవం జరుగుతుందని భక్తుల నమ్మకం.

కల్యాణభాగాన్నిచ్చే వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల వివాహ మహోస్తవం జరిగేటప్పుడు చూసిన భక్తులు జన్మ సార్ధకం అయిపోతుంది. మోక్షమూ లభిస్తుంది.



మరో కథ 


దక్ష యజ్ఞం ధ్వంసం చేయటానికి శివుని జటాజూటంనుంచి ఉద్భవించిన మూర్తి వీరభద్రుడు. దక్షుని సంహరించిన తర్వాత యజ్ఞ పరిసమాప్తికై దక్షుని తిరిగి బ్రతికించుటకు పలు దేవతలు వేడగా అంగీకరించాడు. గొఱ్ఱె తలను దక్షుని శరీరమునకు అంటించి దక్షుని బ్రతికించి యజ్ఞాన్ని పూర్తి చేయించారు. తర్వాత కూడా వీరభద్రుడు శాంతించలేదు. కారణం సతీదేవి ఆత్మాహుతి. వీరభద్రుని శాంతింపచెయ్యటం ఎవ్వరితరమూకాక జగదంబను ప్రార్ధించారు. ఆవిడ తన షోడశ కళలలో ఒక కళ
అయిన భద్రకాళిని పంపింది. ఆమె ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడు భద్రకాళి పక్కనేవున్న ఒక తటాకమునందు మునిగి అత్యంత సుందరమైన ఒక కన్య రూపమున సాక్షాత్కరించినది. ఆమెను చూసి వీరభద్రుడు శాంతించి ఆమెను వివాహమాడాడు. ఆ నాటినుంచీ మహామునులందరూ శ్రీ స్వామివారికి గాంధర్వ వివాహ పధ్ధితిన నిత్యకళ్యాణను చేయసాగారు. ఆ పధ్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఆ కాలంలో మహామునులందరూ గౌతమీనదీ తీరంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని వున్న ప్రదేశాన్ని మునిమండలి అనేవారు. అదే ప్రస్తుతం మురమళ్ళ.

తమ సంతానం వివాహం ఆలస్యం అయిందనుకున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే తమ సంతానం వివాహం త్వరగా అవుతుందని నమ్ముతారు. అలా కళ్యాణం చేయించే భక్తులకు ఇక్కడ సత్రంలో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు





ఈ గుడికి సంబదించిన మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి వీరేశ్వరస్వామి - భద్రకాళీ దేవి


Tuesday, 22 October 2013

మురమళ్ళ కు సంబందించిన కొన్ని సంగతులు

మురమళ్ళ కు సంబందించిన  కొన్ని సంగతులు
మురమళ్ళ విస్తీర్ణం   : 448 హెక్టార్లు
జనాబా                   : సుమారు 5500
ఇల్లు                      : సుమారు 1365
పోస్టల్ పిన్ కోడ్       : 533220
ఎస్ టీ డి కోడ్          : 08856
పోస్ట్ ఆఫీసు            : కేసనకుర్రు పాలేము

పోలీస్ స్టేషన్ : ఐ పోలవరం @ యెదుర్లంక బ్రిడ్జి
                     08856 - 278388 / 94407 96540

బ్యాంక్స్     : 1. స్టేట్ బ్యాంకు  అఫ్ హైదరాబాద్
                      డోర్ నెంబర్ : 3-210
                      మురమళ్ళ బ్రిడ్జి దగ్గర
                      ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ : SBHY0021354
                      ఫోన్ నెంబర్ : 08856-278266
                  2. విజయ బ్యాంకు
                      హై స్కూల్ రోడ్
                      మురమళ్ళ
                      ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ : VIJB0004040
                      ఫోన్ నెంబర్ : 08856 278142
                  3. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
                      డోర్ నెంబర్ : 3-94
                       హై స్కూల్ రోడ్
                       మురమళ్ళ
                       ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ : SBIN0014570
                       ఫోన్ నెంబర్ : 9666992026

స్కూల్స్  :  1. శ్రీ సాయి హై స్కూల్
                   ఫోన్ నెంబర్ : 08856 278405

                  వెబ్ సైట్ అడ్రస్ : శ్రీ సాయి హై స్కూల్          
                  2.బి. వి. టెక్నో స్కూల్                            
                  3. జిల్లా పరిషత్ హై స్కూల్ 

Sunday, 20 October 2013

మురమళ్ల

మురమళ్ల గ్రామం గురించి
ఈ ప్రదేశమున పూర్వము మునులు ఆశ్రమములు ఏర్పాటు చేసుకొని ఉండెడివారని అందువలన ఈ ప్రాంతమును ముని మండలిగా పిలిచేవారని చెపుతారు. కాల ప్రస్థానములొ మెల్లగా పేరు మార్పుచెంది మురమళ్ళగా మారినదని అంటారు. గౌతమీ నదీ తీరగ్రామమైనందున పంటలు బాగుగా పండుతాయి.

మురమళ్ల గ్రామం తూర్పు గొదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ కి 38 కి.మి దూరం (వయా యానం ) లొ వున్నది.ఈ గ్రామం లో సుమారు 1365 ఇల్లు/5500 మంది జనాబా వుంటారు  ఇది ఒక మేజర్ గ్రామా పంచాయితీ.ఈ ప్రాంతం పచ్చని చెట్లు తో అలరారు తు ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ (ద్వీపం) అనగా  అన్ని దిక్కులు  నీరు ఉన్న ప్రాంతం

మురమళ్ల కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి', దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించినది. మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.  
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి దరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్త ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్
కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.


మాండలికపు ఒక సంభాషణ.

నేను ముందే సెప్పేను(చెప్పాను). 

సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. 
కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. 
తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. 
ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.
కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు. 

స్థల పురాణం.

దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిస్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకు ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్ధించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్దతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.

ఆలయ నిర్మాణము

ఈ కధాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయినది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ద శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చినది. తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామమున ఒక ప్రదేశమునకు రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు. 

badrakali sametha vireswara swamy