మురమళ్ల గ్రామం గురించి
ఈ ప్రదేశమున పూర్వము మునులు ఆశ్రమములు ఏర్పాటు చేసుకొని ఉండెడివారని అందువలన ఈ ప్రాంతమును ముని మండలిగా పిలిచేవారని చెపుతారు. కాల ప్రస్థానములొ మెల్లగా పేరు మార్పుచెంది మురమళ్ళగా మారినదని అంటారు. గౌతమీ నదీ తీరగ్రామమైనందున పంటలు బాగుగా పండుతాయి.
మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను(చెప్పాను).
సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు.
కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు.
తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట.
ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.
కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.
స్థల పురాణం.
దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిస్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకు ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్ధించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్దతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కధాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయినది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ద శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చినది. తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామమున ఒక ప్రదేశమునకు రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు.

మురమళ్ల గ్రామం తూర్పు గొదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ కి 38 కి.మి దూరం (వయా యానం ) లొ వున్నది.ఈ గ్రామం లో సుమారు 1365 ఇల్లు/5500 మంది జనాబా వుంటారు ఇది ఒక మేజర్ గ్రామా పంచాయితీ.ఈ ప్రాంతం పచ్చని చెట్లు తో అలరారు తు ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ (ద్వీపం) అనగా అన్ని దిక్కులు నీరు ఉన్న ప్రాంతం
మురమళ్ల కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి', దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించినది. మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి అదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్త ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్
కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను(చెప్పాను).
సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు.
కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు.
తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట.
ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.
కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.
స్థల పురాణం.
దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిస్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకు ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్ధించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్దతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కధాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయినది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ద శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చినది. తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామమున ఒక ప్రదేశమునకు రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు.

No comments:
Post a Comment